హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు సర్దార్ గౌతు లచ్చన్న జయంతి వేడుకలు

SKLM: స్వాతంత్య్ర సమరయోధుడు దివంగత సర్దార్ గౌతు లచ్చన్న జయంతి వేడుకలు ఆదివారం జరగనున్నాయి. ఉదయం 10 గంటలకు నగరంలోని డే అండ్ నైట్ కూడలి వద్ద ఉన్న లచ్చన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు. అనంతరం అంబేద్కర్ ఆడిటోరియంలో సభ నిర్వహిస్తామని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, హాజరుకావాలని పిలుపునిచ్చారు.