AP: నకిలీ వెబ్‌సైట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని టీటీడీ భక్తులకు విజ్ఞప్తి చేసింది. దర్శనాలు, సేవల బుకింగ్స్ అధికారిక వెబ్‌సైట్ ద్వారానే చేసుకోవాలని సూచించింది. TTD పేరు, లోగో వాడి దర్శనం చేయిస్తామని డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపింది. సైబర్ క్రైమ్ పోలీసుల సహకారంతో నిఘా ఏర్పాటు చేసి, గత రెండేళ్లలో 259 ఫేక్ సైట్లను తొలగించినట్లు వెల్లడించింది.
భక్తి
నకిలీ వెబ్‌సైట్ల పట్ల జాగ్రత్తగా ఉండాలి: TTD


