AP: తిరుమలలో శ్రీవారిని దర్శించుకునే భక్తుల రద్దీ పెరిగింది. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. 31 కంపార్టుమెంట్లలో భక్తులు సర్వదర్శనానికి వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 69,082 మంది భక్తులు దర్శించుకున్నారు. 27,846 మంది తలనీలాలు సమర్పించారు. స్వామివారికి హుండీ ఆదాయం రూ.4.09 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.
భక్తి
శ్రీవారి దర్శనానికి 18 గంటలు


