హైదరాబాద్: 28°C
క్రీడలు

టస్కిన్‌ అహ్మద్‌ సంబరాలపై నెటిజన్ల ఆగ్రహం

డార్విన్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్‌ పేసర్‌ టస్కిన్‌ అహ్మద్‌ వికెట్‌ తీసుకున్న అనంతరం చేసిన సంబరాలు వివాదాస్పదంగా మారాయి. ముఖ్యంగా కామెరాన్‌ గ్రీన్‌ను ఔట్‌ చేసిన తర్వాత అతడి ప్రవర్తనపై సోషల్‌ మీడియాలో నెటిజన్లు విమర్శలు గుప్పించారు. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 198 రన్స్‌కు ఆలౌట్ అయింది.