హైదరాబాద్: 28°C
వ్యాపారం

టాటా సన్స్ కొత్త ఛైర్మన్ ఆయనేనా?

టాటా సన్స్ ఛైర్మన్ పదవి నుంచి చంద్రశేఖరన్ తప్పుకోనున్న నేపథ్యంలో కొత్త బాస్ ఎవరనేదానిపై ఆసక్తి నెలకొంది. అయితే టాటా స్టీల్ ఎండీ, సీఈఓగా ఉన్న 61 ఏళ్ల టీవీ నరేంద్రన్ పేరు రేసులో వినిపిస్తోంది. 1988 నుంచి టాటా గ్రూప్‌లోనే ఉన్న నరేంద్రన్‌తో పాటు నోయెల్ టాటా, సౌరభ్ అగర్వాల్ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. కాగా, వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి కొత్త ఛైర్మన్ ఎంపిక జరగనుంది.