హైదరాబాద్: 28°C
వ్యాపారం

గజ్జన్న మృతి.. సీపీఐ నాయకుల నివాళులు

NRML: దస్తూరాబాద్ మండలం దేవునిగూడెం గ్రామానికి చెందిన సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ పార్టీ సీనియర్ నాయకుడు కామ్రేడ్ గుజ్జుల గజ్జన్న అనారోగ్యం చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన భౌతికకాయంపై పార్టీ నాయకులు ఎర్రజెండా కప్పి నివాళులర్పించారు. దేవునిగూడెంలో నిర్వహించిన అంత్యక్రియల్లో సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి జే.రాజు, తదితరులు పాల్గొన్నారు.