హైదరాబాద్: 28°C
క్రీడలు

డేవిడ్ మిల్లర్ రిటైర్మెంట్‌పై కీలక వ్యాఖ్యలు

దక్షిణాఫ్రికా స్టార్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్ 2027 వన్డే ప్రపంచకప్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకాలని భావిస్తున్నట్లు తెలిపారు. సొంతగడ్డపై జరిగే ఈ టోర్నీలో దక్షిణాఫ్రికాను విజేతగా నిలిపి, ఐసీసీ ట్రోఫీతో కెరీర్ ముగించాలనేది తన కల అని చెప్పారు. 37 ఏళ్ల మిల్లర్‌కు ప్రపంచకప్‌లో చోటు దక్కడం సవాలే అయినా, అదే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.