హైదరాబాద్: 28°C
వార్తలు

'పంటల బీమా నమోదు పూర్తి చేయాలి'

VZM: పంటల బీమా, ఈ-పంట, రైతు ఐడీ, ఎరువుల పంపిణీపై కలెక్టర్ రాంసుందర్ రెడ్డి బుధవారం వ్యవసాయ శాఖ అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆగస్టు 15లోగా పంటల బీమా నమోదు పూర్తి చేయాలని ఆదేశించారు. అర్హులైన రైతులందరూ బీమాలో చేరేలా అవగాహన కల్పించాలని సూచించారు. ఎరువుల నిల్వలు, పంపిణీపై నిరంతరం పర్యవేక్షణ చేయాలన్నారు.