హైదరాబాద్: 28°C
వ్యాపారం

గ్యాస్ వినియోగదారులకు గుడ్‌న్యూస్

గ్యాస్ వినియోగదారుల కోసం ఇండియన్ ఆయిల్ 'ఇండేన్ ఎక్స్‌ట్రాలైట్ నౌ' కొత్త సర్వీసును ప్రారంభించింది. దీనిద్వారా కస్టమర్లు బుక్ చేసిన 3 లేదా 4 గంటల్లోనే 10KGల కాంపోజిట్ సిలిండర్ ఇంటికి డెలివరీ అవుతుంది. కొత్త కనెక్షన్ కోసం డాక్యుమెంట్లు కూడా అవసరం లేదు. 'IndianOil One' యాప్ ద్వారా లేదంటే ఇండియన్ ఆయిల్ కస్టమర్ పోర్టల్ లేదా 7588888824 వాట్సాప్ ద్వారా సులభంగా బుక్ చేసుకోవచ్చు.