హైదరాబాద్: 28°C
క్రీడలు

సచిన్‌ను అధిగమించిన విరాట్ కోహ్లీ

అంతర్జాతీయ క్రికెట్‌లో సచిన్ టెండూల్కర్ 100 సెంచరీలతో ప్రపంచ రికార్డు నెలకొల్పారు. అయితే జట్టు విజయాల్లో భాగమైన సెంచరీల విషయంలో విరాట్ కోహ్లీ సచిన్‌ను అధిగమించాడు. సచిన్ 53 సెంచరీలు విజయాల్లో సాధించగా, కోహ్లీ ఇప్పటివరకు 59 మ్యాచ్ విన్నింగ్ సెంచరీలు చేశాడు. దీంతో జట్టు విజయాల్లో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో నిలిచాడు.