హైదరాబాద్: 28°C
వార్తలు

రాష్ట్ర సమర యోధుల వారసుల సంఘం కార్యదర్శి గా వెంకటేశం

PDPL : రాష్ట్ర స్వాతంత్య్ర సమరయోధుల వారసుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా జిల్లాకు చెందిన బాలసాని వెంకటేశం సోమవారం ఎన్నికయ్యారు. తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన సంఘం ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. సమరయోధుల కుటుంబాల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.