హైదరాబాద్: 28°C
వ్యాపారం

FDIల ఆమోద పరిమితి పెంపు?

విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు కేంద్రం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. CCEA ఆమోదం పొందాల్సిన FDIల పరిమితిని రూ.5,000 కోట్ల నుంచి ఏకంగా రూ.15,000 కోట్లకు పెంచాలని యోచిస్తోంది. దేశ ఆర్థిక వృద్ధి, ద్రవ్యోల్బణం తదితర కారణాల దృష్ట్యా కార్యదర్శుల కమిటీ కూడా ఈ సిఫార్సు చేసింది. దీనివల్ల పెద్ద పెట్టుబడులకు వేగంగా ఆమోదం లభించనుంది.