హైదరాబాద్: 28°C
క్రీడలు

జెమీమాకు గాయం.. ఆసియాకప్‌నకు అనుమానం

మహిళల ఆసియాకప్‌కు భారత క్రికెటర్ జెమీమా రోడ్రిగ్స్ దూరం కానుంది. ప్రస్తుతం జరుగుతున్న హండ్రెడ్ టీ20 లీగ్‌లో సదరన్ బ్రేవ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆమె తొడకండరాల గాయానికి గురై, మిగతా టోర్నీకి దూరమైంది. ఈ నెల 28 నుంచి ఆసియాకప్ ప్రారంభం కానుండగా, 30న థాయ్‌లాండ్‌తో భారత్ తొలి మ్యాచ్ ఆడనుంది. అప్పటిలోగా జెమీమా కోలుకుంటుందో లేదో చూడాలి.