హైదరాబాద్: 28°C
వ్యాపారం

బస్సు కింద పడి మహిళ మృతి

SRD: రుద్రారం బ్రిడ్జి వద్ద విషాద ఘటన చోటుచేసుకుంది. ఆటోలో వెళ్తున్న సమీనా బేగం (20) కళ్లు తిరిగి రోడ్డుపై పడిపోగా, వెనుక నుంచి వచ్చిన బస్సు ఆమెపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఘటన అనంతరం ఆటో డ్రైవర్ వెళ్లిపోయినట్లు సమాచారం. బస్సు, ఆటో డ్రైవర్లపై చర్యలు తీసుకోవాలని మృతురాలి భర్త పోలీసులను కోరారు. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.