హైదరాబాద్: 28°C
క్రీడలు

సత్తా చాటిన భారత గ్రాండ్‌మాస్టర్‌

భారత యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద మరో అద్భుత విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రతిష్టాత్మక గ్రాండ్‌ చెస్‌ టూర్‌ సెయింట్‌ లూయిస్‌ టోర్నీలో అతడు విజేతగా నిలిచి సత్తా చాటాడు. ఈ టోర్నీలో ప్రజ్ఞానంద ఏకంగా 23/35 పాయింట్లు సాధించి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుని భారత కీర్తిని అంతర్జాతీయ స్థాయిలో మరోసారి సగర్వంగా రెపరెపలాడించాడు.