హైదరాబాద్: 28°C
భక్తి

నేటి నుంచి శ్రీశైలంలో వరుణయాగం

AP: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో ఇవాళ్టి నుంచి 11 వరకు వరుణయాగం సహా సహస్త్ర ఘటాభిషేకం పూజలు నిర్వహించనున్నారు. కార్యక్రమంలో భాగంగా 10న స్వామివారికి ప్రధాన కలశాలు, సహస్రఘటాలతో అభిషేకం, 11న పూర్ణాహుతి, కలశోద్వాసనతో యాగం ముగిస్తారు. అయితే, 9 నుంచి 11 వరకు ఆర్జిత సేవలు నిలిపివేశారు. 9, 10 తేదీల్లో స్పర్శ దర్శనాలు రద్దు, 11న రాత్రి నుంచి స్పర్శ దర్శనాలకు అనుమతి ఇస్తారు.