హైదరాబాద్: 28°C
భక్తి

తిరుమలలో భక్తుల తీవ్ర రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 20 గంటల సమయం పడుతోంది. వైకుంఠం కాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లన్నీ నిండిపోవడంతో, క్యూలైన్ శిలాతోరణం వరకు చేరుకుంది. నిన్న ఒక్కరోజే 66,842 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, 28,670 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.27 కోట్లుగా నమోదైంది.