హైదరాబాద్: 28°C
వ్యాపారం

వృద్ధురాలి ఆచూకీ లభ్యం

CTR: పెనుమూరు మండలం చిప్పారపల్లికి చెందిన సరోజమ్మ (68) అదృశ్యమైన ఘటనలో పోలీసులు ఆమె ఆచూకీని గుర్తించారు. ఈనెల 2 నుంచి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో భాగంగా సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు ఆమె కాణిపాకం వెళ్లినట్లు గుర్తించారు. అనంతరం వృద్ధురాలిని సురక్షితంగా కుటుంబ సభ్యులకు అప్పగించారు.