హైదరాబాద్: 28°C
వార్తలు

'ప్రత్యేక చర్యలు తీసుకోవాలి'

ASR: గిరిజన హక్కుల పరిరక్షణతో పాటు, చట్టాలను సమర్థంగా అమలు చేయాలని బీజేవైఎం జిల్లా నేతలు మత్స్యకొండబాబు, జిల్లా ఉపాధ్యక్షులు శ్రీను, కృష్ణ కోరారు. ఈ మేరకు గురువారం పాడేరులో రాష్ట్ర ఎస్టీ కమిషన్ ఛైర్మన్ సోళ్ల బొజ్జిరెడ్డికి వినతిపత్రం అందజేశారు. జీవో నెం.3కు ప్రత్యామ్నాయంగా కొత్త జీవో తీసుకురావాలన్నారు. గిరిజన యువత ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలన్నారు.