హైదరాబాద్: 28°C
క్రీడలు

ఫుట్‌బాల్ ఆడుతుండగా ఆటగాడిపై పిడుగు

థాయ్‌లాండ్‌లో ఫుట్‌బాల్ మ్యాచ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మ్యాచ్ జరుగుతుండగా ఆటగాడిపై పిడుగు పడింది. దీంతో 24 ఏళ్ల సోఫన్ అవేయ్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో 12 మంది గాయపడినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.