హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు ఇవాళ భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.3,980 పెరిగి రూ.1,49,730కి చేరింది. ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.3,650 పెరిగి రూ.1,37,250గా ఉంది. అటు కిలో వెండి ధర ఎలాంటి మార్పు లేకుండా రూ.2,45,000 వద్ద కొనసాగుతోంది. దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఇవే ధరలు ఉన్నాయి.
వ్యాపారం
షాకిచ్చిన బంగారం ధరలు


