హైదరాబాద్: 28°C
క్రీడలు

రోహిత్ ఫ్యూచర్‌పై కైఫ్ కీలక వ్యాఖ్యలు

రోహిత్ శర్మ వన్డే ప్రపంచకప్ ఆడే అవకాశంపై మహ్మద్ కైఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని ఫిట్‌నెస్ సాధించాడని, బ్యాట్‌తోనూ అదరగొడుతున్నాడని కైఫ్ తెలిపాడు. తన ప్రదర్శనతో జట్టు నుంచి తప్పుకునే ప్రసక్తే లేదని రోహిత్ సంకేతాలు ఇస్తున్నాడని పేర్కొన్నాడు. అయితే, అతడి భవిష్యత్తుపై సెలక్టర్లు ఏ నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాలని చెప్పాడు.