హైదరాబాద్: 28°C
భక్తి

శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటలు

తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. సర్వదర్శనానికి 30 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. భక్తులకు ఆలయ అధికారులు అన్ని వసతులు కల్పించారు. నిన్న శ్రీవారిని 78,561 మంది భక్తులు దర్శించుకున్నారు. 33,361 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.4.31 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.