హైదరాబాద్: 28°C
భక్తి

శ్రీవారి దర్శనానికి 15 గంటలు

AP: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. 17 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 84,645 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.50 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.