హైదరాబాద్: 28°C
క్రీడలు

వెనక్కి తగ్గిన ఫిఫా అధ్యక్షుడు

ఫుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు గియాని తీసుకున్న ఓ నిర్ణయంపై విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. పురుషుల, మహిళల ప్రపంచ కప్‌లతోపాటు కీలక టోర్నీలను నిర్వహించే కమర్షియల్ యూనిట్‌లో వాటాను విక్రయించాలని గియాని ప్రతిపాదించాడు. దీంతో యూఈఎఫ్ఏ, ఇతర సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఈ నేపథ్యంలో తమ వాణిజ్య సంస్థలోని వాటాను విక్రయించాలన్న ప్రణాళికను ఫిఫా విరమించుకుంది.