హైదరాబాద్: 28°C
వ్యాపారం

తగ్గిన బంగారం ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.380 దిగొచ్చి రూ.1,44,220కి చేరింది. అదేవిధంగా 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.350 తగ్గి రూ.1,32,200 ఉంది. అటు కిలో వెండి ధర రూ.2,35,000 వద్ద కొనసాగుతోంది. దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఇవే ధరలు ఉన్నాయి.