హైదరాబాద్: 28°C
క్రీడలు

ఫైన‌ల్లో ప్రీతి.. ప‌త‌కం ఖాయం

కామ‌న్‌వెల్త్ గేమ్స్‌లో మహిళల 54 కేజీల విభాగం సెమీఫైనల్లో భారత బాక్సర్‌ ప్రీతి పవార్‌ 5-0తో జాంబియాకు చెందిన కేథరిన్ వేప్‌ను ఓడించి ఫైనల్‌లో అడుగుపెట్టింది. దీంతో భారత్‌ ఖాతాలో స్వర్ణం లేదా రజతం ఖరారైంది. ప్రపంచ మూడో ర్యాంకర్‌ అయిన ప్రీతి పవార్‌ అద్భుత ప్రదర్శనతో దేశానికి పతకాన్ని లాంఛనప్రాయం చేసింది.