హైదరాబాద్: 28°C
క్రీడలు

ఫుట్‌బాల్ దిగ్గజం ఫ్రాంకో బరేసి కన్నుమూత

ఇటలీ మాజీ కెప్టెన్, ఫుట్‌బాల్ దిగ్గజం ఫ్రాంకో బరేసి (66) అనారోగ్యంతో కన్నుమూశారు. అత్యుత్తమ డిఫెండర్లలో ఒకరిగా పేరుగాంచిన ఆయన ఇటలీ తరఫున 81 మ్యాచ్‌లు ఆడారు. 1982 వరల్డ్ కప్ గెలిచిన జట్టులో కీలక సభ్యుడు. తన కెరీర్ మొత్తాన్ని ఏసీ మిలాన్ క్లబ్‌కే అంకితం చేయగా, ఆయన సేవలకు గుర్తింపుగా ఆ క్లబ్ నంబర్-6 జెర్సీని శాశ్వతంగా రిటైర్ చేసింది.