హైదరాబాద్: 28°C
క్రీడలు

జెర్సీపై విమర్శలు.. స్పందించిన హాకీ ఇండియా

భారత హాకీ జట్టు కొత్త జెర్సీ బ్లూ నుంచి కాషాయం రంగుకు మార్చిన విషయం తెలిసిందే. దీనిపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తాజాగా దీనిపై హాకీ ఇండియా  స్పందించింది. బ్లూ సింథటిక్ మైదానంలో బాగా కనిపించేందుకే జెర్సీ రంగును మార్చినట్లు స్పష్టం చేసింది. కాషాయ రంగు ధైర్యం, త్యాగం, విజయానికి ప్రతీకగా నిలుస్తుందని తెలిపింది.