హైదరాబాద్: 28°C
వ్యాపారం

3,040 మంది దగ్గర రూ.104 లక్షల కోట్లు

భారతదేశంలో ధనవంతుల సంఖ్య వేగంగా పెరుగుతోందని ‘360 వన్‌ వెల్త్‌ క్రియేటర్స్‌ లిస్ట్‌ 2026’ నివేదిక వెల్లడించింది. కేవలం 3,040 మంది వద్దే సుమారు రూ.104 లక్షల కోట్ల సంపద ఉన్నట్లు తెలిపింది. వీరు ఒక్కొక్కరు కనీసం రూ.425 కోట్ల సంపదను కలిగి ఉన్నారని నివేదిక పేర్కొంది. దేశంలో సంపద కొన్ని కుటుంబాల వద్దే ఎక్కువగా పోగుబడి ఉందనడానికి ఈ నివేదికే నిదర్శనం.