హైదరాబాద్: 28°C
వార్తలు

కూలే దశలో పాఠశాలలు.. పట్టించుకోని అధికారులు

BDK: జూలూరుపాడు, పాల్వంచ రూరల్ మండలాల్లోని పలు ప్రభుత్వ పాఠశాలలు శిథిలావస్థలో ఉన్నాయి. స్లాబ్ పెచ్చులూడి, వర్షానికి కురుస్తుండటంతో విద్యార్థులు ప్రాణభయంతో చదువుకుంటున్నారు. కొత్తూరులో 40 మందికి ఒకే గదిలో తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రమాదకర భవనాలను తొలగించి కొత్తవి నిర్మించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.