SRCL: రైతులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారం తగ్గించాలని ఎల్లారెడ్డిపేట PACS ఛైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. పెరుగుతున్న సాగు వ్యయాలు, ఎరువుల ధరల పెంపు, రవాణా ఖర్చులతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కాంప్లెక్స్ ఎరువుల ధర రూ. 1300 నుంచి రూ. 2100కు పెంచడం రైతులపై ఆర్థిక భారం మోపుతోందన్నారు.
వార్తలు
'రైతులపై ప్రభుత్వాలు భారం తగ్గించాలి'


