మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో పోలీసులు నిర్వహించిన ఒక ప్రత్యేక సర్వేలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఏడాది మొదటి 6 నెలల్లోనే 29 మంది యువకులు బలవన్మరణానికి పాల్పడినట్లు తేలింది. వీరంతా వివాహ వయస్సు దాటినా.. పెళ్లి కావడం లేదనే ఆవేదనతో ఆత్మహత్య చేసుకున్నట్లు వెల్లడైంది. ముఖ్యంగా బంధుమిత్రుల ఒత్తిళ్లు, మానసిక ఆందోళనలే వీరి ఆత్మహత్యలకు కారణమని ఈ సర్వే స్పష్టం చేసింది.
క్రైమ్
పెళ్లి కావట్లేదని.. 29 మంది ఆత్మహత్య


