PLD: వినుకొండ నియోజకవర్గంలోని ఉమ్మడివరంలో టీడీపీ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. సీఎం చంద్రబాబు పిలుపు మేరకు, రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఆదేశాలతో యూనిట్ ఇన్‌చార్జ్ గరిమిడి తిరుపతిరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.
వార్తలు
ఉమ్మడివరంలో టీడీపీ ఇంటింటి ప్రచారం


