హైదరాబాద్: 28°C
వ్యాపారం

బోయింగ్ విమానాలకు FAA కీలక సూచన

బోయింగ్ 737 మ్యాక్స్ విమానాల భద్రతపై.. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) కీలక సూచనలు చేసింది. 453 బోయింగ్ 737 మ్యాక్స్ విమానాల్లో సీట్ల ఫిట్టింగ్‌లో లోపాలున్నాయని.. వాటికి వెంటనే అవసరమైన మరమ్మతులు చేపట్టాలని సూచించింది. ఈ ఆదేశాలు బోయింగ్ 737 MAX 8, MAX 9, MAX 8200 మోడళ్లకు వర్తిస్తాయని తెలిపింది. ఈ లోపాలను గుర్తించామని, వాటిని సరిచేస్తామని బోయింగ్ వెల్లడించింది.