హైదరాబాద్: 28°C
క్రీడలు

భారత్‌కు రెండు రజత పతకాలు

గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో భారత్‌కు తాజాగా రెండు రజత పతకాలు లభించాయి. వెయిట్‌లిఫ్టింగ్ 79 KGల విభాగంలో పల్లూరి అజయ్ బాబు రజత పతకం సాధించాడు. మరోవైపు పురుషుల హైజంప్ విభాగంలో సర్వేశ్ కుశారే రజత పతకాన్ని సాధించాడు. కామన్వెల్త్ క్రీడల చరిత్రలోనే హైజంప్ విభాగంలో పతకం సాధించిన తొలి భారతీయుడిగా సర్వేశ్ నిలిచాడు. వీటితో భారత పతకాల సంఖ్య 10కి చేరింది.