హైదరాబాద్: 28°C
వార్తలు

యువకులు, విద్యార్థులకు ప్రత్యేక పోటీలు

AP: ఆగస్టు 1న భోగాపురం విమానాశ్రయ ప్రారంభంపై CM చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. "ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు" నినాదంతో ఈ వేడుకలు చేపట్టాలని ఆదేశించారు. యువకులకు వాలీబాల్, రన్, పాటలు, పద్యాల పోటీలు నిర్వహించాలని.. స్కూల్, కాలేజీ విద్యార్థులకు ఎయిర్‌పోర్టుతో లాభాలపై క్విజ్, డ్రాయింగ్, వ్యాసరచన పోటీలు పెట్టాలన్నారు. ప్రతిభ కనబరిచిన 600 మందిని విజేతలుగా ఎంపిక చేయాలని సూచించారు.