HNK: పరకాల పట్టణంలోని ఆర్కే సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్ దుకాణంలో వ్యవసాయ శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. దామిని-541 రకం మిర్చి విత్తనాల నమూనాలను సేకరించి నాణ్యత పరీక్షల కోసం రాజేంద్రనగర్ ల్యాబ్‌కు పంపించారు. నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. రైతుల ప్రయోజనాలకు పూర్తిగా సహకరిస్తామని దుకాణ యజమాని రాజు పేర్కొన్నారు.
వార్తలు
మిర్చి విత్తనాలపై వ్యవసాయ శాఖ తనిఖీలు


