హైదరాబాద్: 28°C
వార్తలు

CJP వార్నింగ్.. దిగొచ్చిన అస్సాం, బిహార్

విద్యార్థులపై అక్రమ కేసులను ఎత్తివేయకుంటే.. మరో ఉద్యమం తప్పదన్న CJP ప్రకటనతో అస్సాం, బిహార్ ప్రభుత్వాలు దిగొచ్చాయి. NEET ఉద్యమంలో అరెస్టు చేసిన విద్యార్థులను తక్షణమే విడుదల చేయాలని అధికారులను ఆదేశించాయి. ఆ రాష్ట్రాల్లో విద్యార్థులు, ఆందోళనకారులపై నమోదు చేసిన అన్ని రకాల కేసులను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించాయి. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులను విడుదల చేశాయి.