హైదరాబాద్: 28°C
వ్యాపారం

లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 627 పాయింట్ల లాభంతో 76,692 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 181 పాయింట్లు ఎగబాకి 23,948 దగ్గర కొనసాగుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ కాస్త కోలుకుని 96.18గా ఉంది. పశ్చిమాసియాలో ఘర్షణలకు తాత్కాలికంగా బ్రేక్ పడటంతో చమురు ధరలు దిగొచ్చాయి. దీంతో వరుసగా నష్టాలు చవిచూసిన సూచీలు ఇవాళ లాభాల బాటపట్టాయి.