హైదరాబాద్: 28°C
భక్తి

నేటితో జగన్నాథ రథయాత్ర ముగింపు

పూరీ జగన్నాథ రథయాత్ర ఇవాళ జరిగే 'నీలాద్రి బిజే' ఉత్సవంతో ముగుస్తుంది. నీలాద్రి అంటే స్వామి ఉండే ఆలయం, బిజే అంటే ప్రవేశం అని అర్థం. గుండిచా ఆలయం నుంచి జగన్నాథ, బలభద్ర, సుభద్రలు తిరిగి ప్రధాన ఆలయానికి చేరుకున్నా తలుపులు తెరుచుకోవు. తనను వదిలేసి వెళ్లారని లక్ష్మీదేవి అడ్డుకుంటుంది. అప్పుడు జగన్నాథుడు రసగుల్లాలు ఇచ్చి బుజ్జగించడంతో లక్ష్మీదేవి శాంతించి ఆలయంలోకి ఆహ్వానిస్తుంది.