హైదరాబాద్: 28°C
భక్తి

నేటి నుంచి ఇంద్రకీలాద్రిపై శాకాంబరీ ఉత్సవాలు

AP: విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ ఆలయంలో ఇవాళ్టి నుంచి మూడు రోజులపాటు శాకంబరీ ఉత్సవాలు నిర్వహించనున్నారు. అమ్మవారు శాకంబరీదేవి అలంకరణలో దర్శనమిస్తారు. ఆకుకూరలు, కూరగాయలు, పండ్లతో ప్రకృతి మాతగా శోభాయమానంగా అలంకరిస్తారు. దుర్గా మల్లేశ్వర హోల్‌సేల్ కూరగాయల మార్కెట్ వ్యాపారులు, ధర్మకర్తల మండలి సభ్యుల సహకారంతో తొలి విడతగా 7 టన్నుల కూరగాయలను సమర్పించారు.