PDPL: బీసీలకు 50% రిజర్వేషన్లు అమలు చేసిన సాహూ మహారాజ్ విగ్రహాన్ని గోదావరిఖనిలో ఏర్పాటు చేయాలని అంబేడ్కర్ యువజన సంఘం నాయకులు డిమాండ్ చేశారు. GDK అంబేడ్కర్ భవన్‌లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడారు. బీసీల అభ్యున్నతికి రిజర్వేషన్లు కీలకమని, సాహూ మహారాజ్ చూపిన బాటలో నడవాలన్నారు. ప్రభుత్వం వెంటనే విగ్రహ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు.
వార్తలు
'సాహు మహారాజు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి'


