హైదరాబాద్: 28°C
క్రైమ్

BREAKING: నలుగురు మృతి

TG: నిజామాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. శ్రీరాంసాగర్ జలాశయంలో మునిగి నలుగురు యువకులు మృతి చెందారు. ఆ యువకులు సరదాగా ఈతకు వెళ్లగా.. ప్రమాదవశాత్తు నీట మునిగారు. విషయం తెలుసుకున్న స్థానికులు ఆ నలుగురి మృతదేహాలను వెలికితీశారు. మృతుల్లో ముగ్గురు నిజామాబాద్ వాసులు కాగా.. మరో వ్యక్తి హైదరాబాద్ వాసిగా గుర్తించారు. యువకుల మృతితో వారింట విషాదఛాయలు అలుముకున్నాయి.