హైదరాబాద్: 28°C
క్రీడలు

భారత అథ్లెట్లకు జపాన్ వంటలు

ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత అథ్లెట్లకు జపాన్ ఆహార పదార్థాల్ని ఇప్పటినుంచే అలవాటు చేస్తున్నారు. గతంలో టోక్యో, పారిస్ ఒలింపిక్స్‌ల్లో అక్కడి వంటలకు త్వరగా అలవాటు పడలేకపోవడంతో భారత అథ్లెట్లు ఇబ్బంది పడ్డారు. అది వారి ప్రదర్శనపై ప్రభావం చూపింది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు క్రీడా ప్రాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చెఫ్ జెయరాజ్ తెలిపాడు.