హైదరాబాద్: 28°C
వ్యాపారం

ఆ ప్రచారంలో వాస్తవం లేదు: అదానీ గ్రూప్

విమానయాన సేవల్లోకి ప్రవేశించేందుకు అదానీ గ్రూప్ సన్నాహాలు చేస్తోందని ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపై ఆ సంస్థ తాజాగా క్లారిటీ ఇచ్చింది. ఆ ప్రచారం, మార్కెట్ ఊహాగానాలు నిరాధారమైనవని, అవాస్తమని అదానీ గ్రూప్ స్పష్టం చేసింది. విమానయాన రంగంలోకి ప్రవేశించడానికి అదానీ ఎంటర్‌ప్రైజెస్ ఏ ప్రతిపాదనను పరిశీలించడం లేదని ప్రకటించింది.