హైదరాబాద్: 28°C
వ్యాపారం

భగ్గుమన్న చమురు ధరలు

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు మళ్లీ ఆకాశన్నంటుతున్నాయి. బ్రెంట్ క్రూడ్ ఆరు వారాల గరిష్టానికి చేరింది. గురువారం ఉదయం బ్యారెల్ ధర 1.5 శాతానికి పైగా పెరిగి 95 డాలర్లు దాటి ట్రేడ్ అవుతోంది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియెట్ క్రూడ్ బ్యారెల్ ధర 88 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఈ ఒక్క నెలలో బ్రెంట్ క్రూడ్‌ ధర ఇప్పటివరకు దాదాపు 30శాతం పెరగడం గమనార్హం.