AKP: నర్సీపట్నం శాఖ గ్రంధాలయంలో గురువారం చంద్రశేఖర్ ఆజాద్, బాలగంగాధర్ తిలక్ జయంతి కార్యక్రమం నిర్వహించారు. లైబ్రరీ దమయంతి ఆధ్వర్యంలో చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వ్యాయామ ఉపాధ్యాయుడు ప్రభాకర్ మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటంలో పోరాటంలో ఆజాద్ చేసిన సేవలను కొనియాడారు. బాలగంగాధర్ తిలక్ ఎన్నో అద్భుత రచనలను అందించారని పేర్కొన్నారు.
వార్తలు
లైబ్రరీలో ఆజాద్, గంగాధర్ తిలక్ జయంతి


