అధో ముఖ శ్వానాసనం వల్ల శరీరానికి బలం చేకూరుతుంది. చేతులు, భుజాలు, కాళ్లు, వెన్ను కండరాలు బలపడతాయి. కాళ్లు, పిక్కల కండరాలు సాగి వశ్యత పెరుగుతుంది. తల కిందికి ఉండటం వల్ల మెదడుకు రక్త ప్రసరణ, ఆక్సిజన్ అంది ఉత్తేజం వస్తుంది. అలసట, తేలికపాటి తలనొప్పి, ఆందోళన తగ్గి మనస్సు ప్రశాంతం అవుతుంది. వెన్నెముక సాగదీయబడి, వెన్నులోని ఒత్తిడి తగ్గి మెరుగైన భంగిమ వస్తుంది.
ఆరోగ్యం
అధో ముఖ శ్వానాసనం వల్ల కలిగే లాభాలు


