హైదరాబాద్: 28°C
క్రీడలు

స్పోర్ట్స్ అథారిటీ బృందం తనిఖీలు

ఖేలో ఇండియా గేమ్స్ 8వ ఎడిషన్‌కు ఆతిథ్యమిచ్చేందుకు తెలంగాణ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI) బృందం హైదరాబాద్‌లోని గచ్చిబౌలి, LB స్టేడియంతో పాటు పలు క్రీడా ప్రాంగణాలను సందర్శించింది. స్టేడియాల్లో వసతులపై సంతృప్తి వ్యక్తం చేసింది. పోటీల నిర్వహణకు అవసరమైన మరమ్మతులు చేపట్టి, మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలని సూచించింది.